Nallagonda Kathalu - Mallikarjun - Talk Show - నల్లగొండ కధలు - మల్లికార్జున్ - టాక్ షో

Kalyana's I My Voice - Telugu Podcast - నేను నా స్వరం show

Summary:
Nallagonda Kathalu - Mallikarjun - Talk Show - నల్లగొండ  కధలు - మల్లికార్జున్ - టాక్ షో

గట్టిగ తిరిగితే ఒక ఇరవై నిమిషాలల్ల మా ఊరు చూశుడు అయిపోతది. ‘అర్బనూరు’ అని నేనొక కథ కోసం కనిపెట్టిన పదం మా ఊరిని చూసి పెట్టిందే. అచ్చంగా అట్లనే ఉంటది మా ఊరు. సిటీకి ఊరులెక్క. ఊరికి సిటీలెక్క. నేను మా ఊరి గురించి, మా ఊరి మనుషుల గురించి, మా నాన్న గురించి, మా అమ్మ గురించి చెప్పాల్నని చానా రోజుల్నించి అనుకుంటున్న.

చెప్తానికి చానా కథలున్నయి సరే, అయి ఎట్ల చెప్పాలి? ఏది కథ అయితది? ఈ జ్ఞాపకాలు, ఇష్టాలన్నీ పోగేసి ఏం కథ రాయాలి? ఇదంత నా మెదడుల తిరుగుతనే ఉండె. మొత్తానికి కొన్ని కథలు దొరికినయి. వాటి గురించి ఆలోచించుకుంట ఈ కథలు రాస్తుంటె నాకు నేను దొరుకుతనే ఉన్న. ఒక్కసారి గతాలకువోతే మనకు మనం గుర్తొస్తమంటే ఇదే. ఇయి రాస్తుంటే నన్ను నేను మళ్లా దోలాడుకుంటున్నట్టు, నాకు నేను మళ్లా దొరుకుతున్నట్టు అనిపిచ్చింది. మీగ్గూడ అట్లనే అనిపిస్తదా లేదా చెప్పలేను. సదివి మీరే చెప్పాలి.

కాగితం పడవలు - చిన్న కథలైనా సమకాలీన కథలు నిత్యం మన చుట్టూ వుండే పాత్రలతో అందంగా రాయబడ్డాయి

ఇరానీకి కేఫ్- పదును తేలిన రచనలు 13 కథలు , తరం కథలు, మారుతున్న జీవనం, వ్యక్తుల గురించి చదువుతున్నంత సేపు కథలగురించి ఆలోచింపచేస్తాయి.